లెక్కలు తారుమారు.. కరోనాలో నెల్లూరు టాప్

by srinivas |   ( Updated:2020-04-03 04:25:06.0  )
లెక్కలు తారుమారు.. కరోనాలో నెల్లూరు టాప్
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ లెక్కలు తారుమారవుతున్నాయి. తొలి వారం రోజుల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ విశాఖపట్టణం జిల్లాలోనమోదయితే.. తరువాత ప్రకాశం జిల్లాలో నమోదై ఆయా జిల్లాల వైద్యఆరోగ్య శాఖాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. గత నాలుగు రోజులుగా గణనీయంగా కేసులు నమోదవుతూ జిల్లాల లెక్కలు తారుమారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో 161 కరోనా కేసులుండగా… అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 మంది, కృష్ణా 23, గుంటూరు 20, వైఎస్సార్‌ కడప 19, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 14, చిత్తూరు, తూర్పు గోదావరిలో 9 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదు అయ్యాయి. గత రెండు రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీలో నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్ మర్కజ్‌లో పాల్గొన్న వారే కావడం విశేషం.

Tags: andhrapradesh, corona virus, ap, nellore, top cases, covid-19

Advertisement

Next Story

Most Viewed