- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
50వేలు దాటి ముందుకు
• దేశంలో ఒక్కరోజులో 3561 కేసులు
• 7వేల కేసులతో రెండో ప్లేస్‌లోకి గుజరాత్
దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. గురువారం దేశవ్యాప్తంగా 3561 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 52952కి చేరింది. గురువారం 1084 మంది వ్యాధి నుంచి కోలుకోగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 15267 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జయ్యారు. కరోనాతో కొత్తగా 89 మంది చనిపోగా మొత్తం మరణించినవారి సంఖ్య 1783కు చేరింది. ఈ వివరాలను కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మణిపూర్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి మొత్తం 13 రాష్ట్రాల్లో కొత్త కేసులేవీ రికార్డవలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 56 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరింది. ఇక్కడ ఒక్కరోజులోనే 51 మంది డిశ్చార్జవగా మొత్తంమీద ఇప్పటివరకు 780 మంది డిశ్చార్జయ్యారు. గురువారం ఇద్దరు చనిపోగా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి మొత్తం సంఖ్య 38కి చేరింది.
మహారాష్ట్రలో కొత్తగా 1362 పాజిటివ్ కేసులు నమోదవడంతో బుధవారం వరకు ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18120కి చేరింది. తమిళనాడులో కొత్తగా 580 కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్యను 5409కి వెళ్లింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1547 మంది డిశ్చార్జవగా బుధవారం ఒక్కరోజే 31 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 37మంది చనిపోగా గురువారం ఇద్దరు మరణించారు. రాజధాని చెన్నై నగరంలో కొత్తగా గురువారం 316 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2644కు చేరింది.
రెండో స్థానానికి గుజరాత్
దేశంలోనే కరోనా కేసుల్లో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్ర తర్వాతి స్థానంలో వున్న ఢిల్లీని వెనక్కి నెట్టిన గుజరాత్ గురువారం రెండో స్థానానికి ఎగబాకింది. ఇక్కడ ఒక్కరోజే 388 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7013కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 29 మంది కరోనాతో మరణించగా మొత్తం మరణించిన వారి సంఖ్య 425కు చేరింది. రాజధాని అహ్మదాబాద్ నగరంలోనే గురువారం 275 పాజిటివ్ కేసులు నమోదవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో చనిపోతున్న వారి రేటు 6.1 శాతంతో దేశ సగటు కన్నా ఎక్కువగా ఉండగా రికవరీ రేటు 24.37 శాతంతో దేశ సగటు కన్నా తక్కువగా ఉంది.
Tags: corona, india, wensday, cases