కూలీలకు కరోనా.. అండగా నిలబడ్డ ఎస్సై…

by Sridhar Babu |
కూలీలకు కరోనా.. అండగా నిలబడ్డ ఎస్సై…
X

దిశ ప్రతనిధి, కరీంనగర్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కూలీ కుటుంబంలో ఒకరికి కరోనా సోకడంతో ఇంటి యజమాని వెల్లగొట్టాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు జార్ఖండ్ కు చెందిన కూలీల కుటుంబానికి పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ కు చెందిన ఓ కుటుంబం కమాన్ పూర్ మండలంలోని రొంపి కుంట గ్రామంలో సెంట్రింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతోంది. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దాారణ కాగా ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని కోరాడు. ఈ సమాచారం అందుకున్న కమాన్ పూర్ ఎస్ఐ శ్యాం పటేల్ ఇంటి యజమానితో చర్చించి కూలీ కుటుంబం ఉండేందుకు సహకరించాలని కోరారు.

ఇంటి యజమానికి వినకపోవడంతో గ్రామ సర్పంచ్, యూత్ సహకారంతో కరోనా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయించడంతో పాటు కూలీ కుటుంబానికి పౌష్టికాహారం అందించి, మాస్కులు, ఇతరాత్ర సామాగ్రిని అందజేశారు. కూలీ కుటుంబంలోని మిగతా ఇద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూడా జ్వరంతో బాధ పడుతున్నారని సర్పంచ్ చెప్పడంతో వారికి కూడా టెస్ట్ లు చేయించారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో గోదావరిఖని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed