అది అందర్నీ షాక్ కు గురిచేసిన సంఘటన!

by vinod kumar |
అది అందర్నీ షాక్ కు గురిచేసిన సంఘటన!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఓ వార్త తెలిసి అందరూ షాక్ కు గురయ్యారు. అధికారులు వెంటనే అప్రమత్తమై అక్కడ తగు చర్యలు తీసుకుంటున్నారు. అదేమిటంటే..

ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన పలువురు అనుమానితులకు వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరిని కలిశారని ఎంక్వైరీ చేశారు. ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి కిరాణ దుకాణం నడిపిస్తుంటాడని, ఆ ప్రాంతానికి చెందిన 94 మందిని అతను కలిసినట్లు నిర్ధారణయ్యింది. దీంతో వారందరికీ కూడా అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆ 94 మందిలో 35 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ప్రాంతంలో మొత్తం 38 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు హాట్ స్పాట్ గా గుర్తించారు.

tags: Delhi, Tughlakabad Extension, Hotspot, Corona for 38 people

Next Story

Most Viewed