- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసులు కాస్త కిందికి.. తీవ్రత పైపైకి..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. వరుసగా మూడో రోజు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం లక్షకు పైగా నమోదైన కరోనా కొత్త కేసులు.. మంగళవారం (ఉదయం 8 గంటల వరకు) 96 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 96,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 446 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో మొత్తం కేసులు కోటి 26 లక్షలు దాటాయి. యాక్టివ్ కేసులు 7,88,223 గా ఉన్నాయి. కాగా, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమైనట్లు ఆయన చెప్పారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో నమోదవుతున్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్టు రాజేష్ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ..
కరోనాను కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరుదాకా రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్..
45 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కొవిడ్-19 ఉధృతిని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా సాగాలని బావిస్తున్న కేంద్రం.. ఈ మేరకు ఉద్యోగులంతా టీకాను వేసుకోవాలని సూచించింది.
వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో మంగళవారం నాటికి 8 కోట్ల (8,31,10,926) మందికి టీకా వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక సోమవారం (ఏప్రిల్ 5) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 43,00,966 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో 39 మంది లక్షల మందికి తొలి డోసు ఇవ్వగా నాలుగు లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు.