- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు మిలియన్లు దాటిన కరోనా కేసులు
దిశ, న్యూస్ బ్యూరో:
దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు మిలియన్లు దాటింది. శుక్రవారం ఉదయం నాటికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 39.36 లక్షలుగా ఉంది. తర్వాత వాటికి వివిద రాష్ట్రాల నుంచి నమోదైన కొత్త కేసులను కలిపితే నలభై లక్షలు (40.06 లక్షలు) దాటింది. గత వారం రోజుల గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల రేటు 1.1% మేర ఉంది. కాగా భారత్ లో మాత్రం అది 2.2 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశం మొత్తం మీద 83,341 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో1,069 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.36 లక్షలుగా ఉంది, మృతుల సంఖ్య 68,472కు చేరుకుంది.
ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. మృతుల సంఖ్య తక్కువగా ఉండడం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. కానీ వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం ప్రజలను, వైద్యారోగ్య శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. టెస్టుల సంఖ్య పెంచిన కొద్ది పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రతీరోజు సగటున వెయ్యి మందికి పైగా కరోనా పేషెంట్లు చనిపోతున్నారు.
ప్రపంచంలో కేసులను సంఖ్యా పరంగా పరిగణనలోకి తీసుకుంటే అమెరికా మొదటి స్థానంలో ఉంటే బ్రెజిల్ 40.41 లక్షలతో రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో రోజువారీ నమోదవుతున్న కొత్త కేసులు 1%గా ఉంటే భారత్‌లో మాత్రం 2.2%గా ఉంది. దీంతో రెండు మూడు రోజుల్లోనే ఆ దేశాన్ని దాటి రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో రోజుకు సగటున 40 వేల కొత్త కేసులు మాత్రమే నమోదవుతుండగా భారత్‌లో మాత్రం 80 వేలకు పైగానే నమోదవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికే దాదాపుగా బ్రెజిల్‌కు సమీపంలోకి వెళ్ళింది. దీంతో త్వరలోనే బ్రెజిల్‌ను భారత్ అధిగమించే అవకాశం ఉంది.
ఇప్పటికీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే మొత్తం పాజిటివ్ కేసులు, కరోనా మృతులు, యాక్టివ్ పాజిటివ్ కేసులు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. దాదాపు 60-70 శాతం మధ్యలో ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.