తెలంగాణలో ఇవాళ 2,734 కేసులు..

by  |
తెలంగాణలో ఇవాళ 2,734 కేసులు..
X

దిశ,వెబ్‌‌డెస్క్ :

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 2,734 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. కొత్త కేసులను కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,27697కేసులు నమోదయ్యాయి.

95,162మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. 31,699 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే, గడచిన 24గంటల్లో కరోనాతో 9మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 836కు చేరింది. రాష్ట్రంలో నిన్న 58,264 టెస్టులు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 14,23,846కు చేరుకుంది.


Next Story