- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 4లక్షల 55వేలు దాటిన కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 60,804 మందికి పరీక్షలు నిర్వహించగా 10,392 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది. 72మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,125కు చేరింది. ప్రస్తుతం ఒక లక్షా 3వేల 76 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 3లక్షల 48వేల 330మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 8,454మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 38లక్షల 43వేల 550మంది శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా బారిన పడి నెల్లూరు జిల్లాలో 11మంది ప్రాణాలు కోల్పోగా చిత్తూరు జిల్లాలో 10మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 9మంది, ప్రకాశంలో 8మంది, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు.
అనంతపురం జిల్లాలో 810 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 1124, తూర్పుగోదావరిలో 1199, గుంటూరులో 900, కడపలో 800, కృష్ణాలో 397, కర్నూలులో 697, నెల్లూరులో 942, ప్రకాశం 800, శ్రీకాకుళం 603, విశాఖపట్నం 675, విజయనగరం 560, పశ్చిమ గోదావరి జిల్లాలో 885మందికి పాజిటివ్‌గా తేలినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.