- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకస్మాత్తుగా కార్డెన్ సెర్చ్.. భారీగా వాహనాలు సీజ్..
దిశ, సూర్యా పేట; పెన్ పహడ్ మండల పరిధిలోని మహ్మదాపురం ఆవాసం, లాల్ సింగ్ తండాలో పోలీసులు శనివారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ విఠల్ రెడ్డి, నలుగురు ఎస్సై లతో సహా 90 మంది సిబ్బందితో తండాలో సెర్చ్ చేశారు. ఈ సెర్చ్ లో 14 బైక్ లు, 2 ఆటో లు సీజ్ చేశారు. గంజాయి అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఆర్ సి లేని వాహనాలని సీజ్ చేస్తామని ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని జాగ్రత్తగా వాహనాల ను నడపాలని అన్నారు. గంజాయి అనుమానితులు ఎవరైనా ఊర్లో తిరిగినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, లవకుమార్, విష్ణుమూర్తి, యాదవేంద్ర రెడ్డి, సర్పంచ్ రజనీ సుధాకర్, ఎంపిటీసి కొండేటి పవన్ తదితరులు పాల్గొన్నారు