- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వంటింటి సూత్రాలు
దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇంట్లో హాయిగా గడుపుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో గృహిణులపై విపరీతమైన పనిభారం పెరిగిందని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ఇండ్లలో పిల్లలు, మగవాళ్లు వంటింట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గరిట తిప్పడానికి వారికి ఇదే మంచి సమయం. భార్య చేతి వంట తినడమే కాదు, స్వీయపాకం భార్యకు, పిల్లలకూ తినిపించేందుకు సిద్ధమవుతున్నారు కొందరు భర్తలు. ఈ సందర్భంగా గృహిణులు, వంటింటిలోకి ప్రవేశించే కొత్త వారికి కొన్ని టిప్స్ అందించే కథనమది..
కరకరలాడే ఆలు ఫ్రై కోసం..
కరకరలాడే ఆలు(బంగాళదుంప) ఫ్రై కావాలంటే ఇలా చేయండి. తొక్క తీసిన ఆలూను అరగంట చల్లటి నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఫ్రై చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా తినేయాలనిపిస్తుంది.
నానబెట్టండిలా..
పప్పును వండే ముందు కందిపప్పును కనీసం 3 నుంచి 4 గంటల పాటు నీటిలో నానబెట్టండి. అప్పుడు మంచి రుచి వస్తుంది. అయితే, నానబెట్టిన నీటినే ఉడికించడానికి వాడాలి. ఇలా చేయడం ద్వారా వండే టైమ్ కూడా తగ్గుతుంది.
అతుకుల్లేని మెతుకుల కోసం..
అన్నం వండేటప్పుడు ఆ పాత్రలో రెండు చుక్కల నెయ్యి లేదా నూనె వేస్తే..రైస్ మరింత రుచిగా ఉంటుంది. ఒక మెతుక్కు మరో మెతుకు అంటుకోదు.
ఫ్రెష్ ఫిష్ కర్రీ..
చేపల పులుసు ఎప్పుడు తిన్నా తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..చేపల్ని ఫ్రిజ్‌లో పెట్టే ముందు వాటికి పసుపు, ఉప్పు రాసి డీప్ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచండి. తద్వారా వండుకున్నకర్రీ గంటల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది. అదనపు పోషకాల కోసం కూరగాయలు ఉడికించిన నీటిని బయటపడేయకుండా..బియ్యంలోకి ఎసరుగా వాడుకుంటే మరిన్ని పోషకాలు జత కలుస్తాయి.
మృదువైన చపాతీల కోసం..
చాలా మందికి గోధుమ పిండిని చల్లటి నీటితో కలపడం అలవాటు. కాని ఇలా చేయడం వల్ల చపాతీలు మృదువుగా రావు. ఇలా కాకుండా గోరువెచ్చని నీటిలో గోధుమ పిండిని కలపండి. చివర కొద్దిగా పన్నీరును కలపండి. అప్పుడు చపాతీలు మృదువుగా వస్తాయి.
Tags : cooking tips, women, lockdown, effect, men also in kitchen