బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య

by Shamantha N |   ( Updated:2020-12-14 05:27:00.0  )
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య
X

భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సామాజిక వ్యవస్థపై అవగాహన లేనందువల్లే శూద్రులను శూద్రులని పిలిస్తే బాధపడతారని నోరుపారేసుకున్నారు. మధ్యప్రదేశ్ సెహోర్‌లో నిర్వహించిన క్షత్రియ మహాసభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజం నాలుగు విభాగాలుగా విభజించబడిందని వివరించారు.

‘ఒక క్షత్రియుడిని క్షత్రియ అని పిలిస్తే బాధపడరు. ఒక బ్రాహ్మిణ్‌ను బ్రాహ్మిణ్ అని పిలిస్తే బాధపడరు. ఒక వైశ్యుడినీ వైశ్యా అని పిలిస్తే బాధపడరు. కానీ, ఒక శూద్రుడిని శూద్రుడు అని పిలిస్తే తెగ బాధపడిపోతారు. ఎందుకు? ఎందుకంటే, కారణం అజ్ఞానం. వారు అర్థం చేసుకోలేరు’ అని అన్నారు. జనాభా నియంత్రణపైనా కామెంట్ చేశారు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికే జనాభా నియంత్రణ చట్టం ఉండాలని, దేశం కోసం జీవించే వారికి ఈ చట్టం వర్తించవద్దని సూచించారు.

మహిళలను ఉద్దేశిస్తూ, ‘క్షత్రియులు తమ బాధ్యతలను గుర్తెరగాలి. వీలైనంత ఎక్కువ మంది సంతానాన్ని కనాలి. వారిని భద్రతా దళాల్లో చేర్చి దేశానికి రక్షణ కల్పించేలా చూడాలి’ అని తెలిపారు. రిజర్వేషన్లూ కులాల ఆధారంగా ఉండకూడదని, ఆర్థిక స్తోమత ఆధారితంగా అమలు చేయాలని అన్నారు.

Advertisement

Next Story