డిపోలోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్.. ఇద్దరికి గాయాలు

by Sumithra |   ( Updated:2021-12-11 21:56:47.0  )
RTC-Bus1
X

దిశ, మేడ్చల్ టౌన్: ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొన్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల సమయంలో మేడ్చల్ డిపోలోకి వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొట్టింది. బస్ లో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

RTC-Bus-Accident1

Advertisement

Next Story