- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మీడియాకు ఆ హక్కు ఉంది’

న్యూఢిల్లీ : రాజ్యాంగ సంస్థలు మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు విధించడం బదులు వాటి కంటే మంచిగా పని చేయగలవని గుర్తెరగాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు సూచించింది. మీడియా మీద ఫిర్యాదులు మానుకోవాలని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కొవిడ్ విజృంభణకు ఈసీని బాధ్యురాలుగా చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ సంస్థ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు విచారణలను, పూర్తి రిపోర్టులను వెలువరించకుండా మీడియాను నియంత్రించాలని కోరుతూ ఈసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ… ‘రాజ్యాంగంలోని ఆర్టికల్-19 (భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు) హక్కు కేవలం ప్రజలకే కాదు. అది మీడియాకూ వర్తిస్తుంది. మీడియాను నియంత్రించడమంటే అది తిరోగమన చర్యే..’ అని తెలిపింది. కోర్టు చర్యలను, విచారణను మీడియా నివేదించకుండా ఉండేందుకు ఈసీ చెప్పిన విషయాలు అసంబద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈసీపై మర్డర్ కేసు పెట్టాలన్న మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు కఠినమైనవేనని, కానీ వాటిని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది