- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహాన్ని చాటుకున్న కానిస్టేబుళ్లు.. చనిపోయిన మిత్రుడి కోసం..
దిశ, మంచిర్యాల: స్నేహమంటే హాయ్.. బాయ్ మాత్రమే కాదు.. మిత్రుడికి కష్టం వస్తే బాసటగా నిలిచే వారే నిజమైన నేస్తం. అలాంటి స్నేహితులనే సంపాధించుకున్నాడు కానిస్టేబుల్ సంతోష్. మందమర్రికి చెందిన ఆయన 2009 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై.. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన అనారోగ్యానికి గురై రెండు నెలల క్రితం మృతిచెందాడు. అతడిపైనే ఆధారపడి జీవిస్తున్న భార్య, తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు మేమున్నాం అంటూ బాసటగా నిలిచారు.
స్నేహమంటే బతికి ఉన్నప్పుడు కలిసి తిరగడం కాదని స్నేహితుడు, అతడి కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడంలోనే నిజమైన స్నేహం ఉంటుందని నిరూపించారు. 2009 బ్యాచ్‌కు చెందిన సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు అందరూ కలిసి సంతోష్ కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి రూ.1.93 లక్షలు జమ చేశారు. ఆ మొత్తాన్ని శుక్రవారం సంతోష్ భార్య స్వప్న, ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని, ఏ సహాయం కావల్సి వచ్చినా తాము సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం సంతోష్ చిత్రపటానికి నివాళి అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.