సీఎం నివాసం వద్ద కానిస్టేబుల్ మృతి

by srinivas |
Constable killed
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున కడప జిల్లా ఇడుపులపాయలోని సీఎం నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న 11వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రభాకర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన సహచర సిబ్బంది, ఉద్యోగులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రభాకర్ కొంతకాలంగా సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభాకర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగింది.

Advertisement

Next Story