ప్రజలు అల్లాడిపోతున్నారు.. ప్రధానిపై కాంగ్రెస్ నేత సునీతారావ్ ఫైర్

by Shyam |   ( Updated:2021-09-09 07:26:00.0  )
Congress women leader Sunita Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ప్రజలను దోచుకుంటున్నారని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం గాంధీ భవన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సునీతారావ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కొన్ని కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ పేదల సొమ్మును దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగితే రాబోయే రోజుల్లో తగిన శైలిలో బుద్ధి చెబుతామన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా అతి త్వరలో రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కార్యచరణను కూడా రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొన్నారు.

Advertisement

Next Story