- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ కోసం పనిచేసిన కాంగ్రెస్.. ఇద్దరు ఎంపీలు ఉన్నా.. ప్రయోజనం శూన్యం
దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ అగ్రనేతల పై కార్యకర్తలు ఉడికి పోతున్నారు. నేను పోటీలో ఉండకపోతే ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. టీఆర్ఎస్ అన్ని ప్రయోగాలు చేసింది. వారికి మా కాంగ్రెస్ నేతలే సహకరించారు’ అంటూ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ జడ్పీటీసీ కుడుదుల నగేష్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో పీసీసీ చీఫ్ కావాలనుకునే వారు.. ఇప్పటికే అయిన వారు ఎంపీలుగా ఉండి కూడా పార్టీని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సొంతగా 300 ఓట్లకు పైచిలుకు బలం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గాలికి వదిలేసిందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా గెలిచి కిందిస్థాయి శ్రేణులకు ఎవరికీ ఓటు వేయాలో చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు ప్రజలను, కార్యకర్తలను మబ్బుల్లో ఉంచారని, తెర వెనుక చాలా రాజకీయాలు చేశారని, కాంగ్రెస్ నేతలు ఎవ్వరికీ మేలు చేస్తున్నారో జిల్లా ప్రజానీకానికి తెలుసని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు 100 శాతం పనిచేశారని. నేను స్వతంత్ర అభ్యర్దినే అయినా.. నేను కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల తీరుపై మామూలు కార్యకర్తలు, నేతలు ఉడికి పోతున్నారు, తెలంగాణ జిల్లాలో ఇద్దరు ఎంపీలు ఉన్న జిల్లా ఇది ఒక్కటేనని, అయినా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఏమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారని వివరించారు.
ఎన్నికల్లో వాళ్ల గెలుపు కోసం కార్యకర్తలు జెండాలు పట్టుకుని పనిచేయాలని, ఆ నేతలు మాత్రం కనీసం పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారని చెప్పారు. ఓటర్లు చాలా స్పష్టంగా ఉన్నారని, హక్కుల కోసం నిలబడాలని కోరుకున్నారని, కానీ డబ్బులు, అధికారం ఉందన్న కోణంలో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని, నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో నిలిచినందుకు మా కాంగ్రెస్ నేతలే బాధపడ్డారని చెప్పుకొచ్చారు. సీపీఎం ఓటు వేయొద్దని ప్రకటించడం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వద్దు అనడం దారుణమని, జిల్లా నేతల్లో హక్కుల కోసం కొట్లాడే వారికి మద్దతు ఇచ్చే సంస్కారం వారికి లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.