‘ఆ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలే’

by Sridhar Babu |
Congress MLC Jeevan Reddy
X

దిశ, జగిత్యాల: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిరసన తెలిపే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేకుండాపోయిందని, కాంగ్రెస్ నాయకుల అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కలేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలను స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తికాకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి శిలాఫలకాలు వేసిన సూరమ్మ చెరువు ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. ఏడాదిలోపు ఎత్తిపోతల ద్వారా నింపుతామన్న మిడ్ మానేరు ఎప్పుడు నింపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Next Story

Most Viewed