MLA Jagga Reddy: కాంగ్రెస్ దగ్గర ఆ పవర్ లేదనే ఈటల బీజేపీలో చేరుతుండు : జగ్గారెడ్డి

by Anukaran |   ( Updated:2021-06-02 07:58:48.0  )
MLA Jagga Reddy: కాంగ్రెస్ దగ్గర ఆ పవర్ లేదనే ఈటల బీజేపీలో చేరుతుండు : జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : మా దగ్గర హోం శాఖ ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరేవాడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈటలకు కేంద్ర హోంశాఖ, ఈడీ, ఇన్‌కాం ట్యాక్స్ డిపార్ట్ మెంట్‌ల సహాయం కావాలని అన్నారు. ప్రస్తుతం అవి కాంగ్రెస్ దగ్గర లేనందునే ఈటల బీజేపీలో చేరుతున్నారని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ బలమైందని, ఈటల బలహీనుడన్న జగ్గారెడ్డి.. పోరాటం చేయాలని అనుకుంటే కాంగ్రెస్ దగ్గరికి వచ్చే వాడన్నారు. ప్రస్తుతం ఈటలపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని, అందువల్ల ఆయనకు ఢిల్లీ హోం శాఖ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కోసం కాదని… పేదలకు మేలు చేయడం కోసమే తాను అంబులెన్సులను ప్రారంభించానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ ఆదేశిస్తే ఇతర జిల్లాల్లో కూడా అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. మా అమ్మ నాన్న పేరుతో మెడికల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాని జగ్గారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో వారి పేరు మీద సేవ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. సంతృప్తి కోసమే అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తున్నాని, రెండు, మూడు రోజుల్లో గాంధీ, ఉస్మానియా వద్ద రెండు చొప్పున అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు వాడుకోవాలని కోరారు. కాగా, ప్రజల సమస్యలకు ఎలాంటి మెడిసిన్ వేయాలో నాకు తెలుసని, అందుకే పీసీసీ అడుగుతున్నాని జగ్గారెడ్డి అన్నారు.

Advertisement

Next Story