- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెంచాల్సింది బిల్లులు కాదు.. కోవిడ్ టెస్ట్‌లు
by Shyam |

X
దిశ, కల్వకుర్తి: లాక్‌డౌన్ సమయంలో సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం దారుణమని ఏఐసీసీ సెక్రెటరీ వంశీచంద్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆమనగల్లు సబ్ స్టేషన్ ఏడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ..పెంచాల్సింది కరెంట్ బిల్లులు కాదు కోవిడ్ టెస్టులు అని ప్రభుత్వానికి చురకలు అంటించారు. వందల రూపాయల నుంచి ఒక్కసారిగా వేలల్లో వచ్చిన కరెంట్ బిల్లులను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి, పీసీసీసభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డీసీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story