- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు : కాంగ్రెస్
దిశ, పెన్ పహాడ్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలని పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తూముల సురేష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కి అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ రావు మాట్లాడుతూ.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదని, రైతే దేశానికి వెన్నెముక అని అన్నారు. అలాంటి రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఏడాది పాటు నిర్విరామంగా పోరాటం నిర్వహించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రవి, సందీప్ రాథోడ్, రాంబాబు, సైదులు, శివ నాయక్, నాగయ్య, లింగయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.