- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటికి కేసీఆర్, కేటీఆర్ పేర్లు.. విమర్శలు
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: బతికున్నోళ్ల పేర్లు పెట్టడమేంటి టీఆర్ఎస్ వాళ్లది మరీ చోద్యంగా ఉందని పీసీసీ కార్యదర్శి ఎన్ పి వెంకటేష్ విమర్శించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని తన రాజకీయ ఉనికి కోసం మహబూబ్ నగర్ జిల్లా చారిత్రాత్మక మయూరి పార్కు పేరును కేసీఆర్ పార్క్ గా ఏండ్ల చరిత్ర ఉన్న వీరన్నపేట ప్రాంతం పేరును కేటీఆర్ పేరుగా మార్చి పాలమూరు చరిత్రను మరుగు పరచే చర్యలకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా కేసీఆర్ పేరు, కేటీఆర్ పేర్లు పెట్టాల్సిన అగత్యం మంత్రికి ఏందుకు దాపురించిందో మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.అసలు కేటీఆర్ ఏ హోదాలో పాలమూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రశ్నించారు.కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమై అది కప్పిపుచ్చుకునేందుకే జిల్లాల పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ట్విట్టర్ వేదికగా అనామకుల పోస్టులకు విపరీతంగా స్పందించే కేటీఆర్ కు తమ భూమిని టీఆరెస్ కార్యకర్తలు కబ్జా చేసారని వారి నుంచి తమ భూమిని కాపాడాలని విన్నవించుకునెందుకు కాన్వాయి ముందుకు పోతుంటే అక్కడ ఉన్న పోలీసులు వారిని నిర్దాక్షిణ్యంగా లాగి పారేస్తుంటే చూడకుండా వెళ్లిపోవటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు, అందుకే తీన్మార్ మల్లన్న కేటీఆర్ కు డ్రామారావు అని పేరు పెట్టాడని గుర్తు చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో పీసీసీ కార్యదర్శులు వినోద్ కుమార్ , ఎన్.పి వెంకటేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బి అనిత మధుసుదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మహ్మాధ్ తాహేర్ పాల్గొన్నారు.