ఈటల దమ్ము మాకు తెలుసు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |
ఈటల దమ్ము మాకు తెలుసు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే సీఎం కేసీఆర్ పొలిటికల్ ఎమర్జెన్సీపై దృష్టి పెట్టారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. శనివారం కొండా ‘దిశ’ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. ఈటల నిజంగా తప్పు చేసినా.. విచారించడానికి ఇది సరైన సమయం కాదని ఎద్దేవా చేశారు. కరోనా విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో వైద్యారోగ్యశాఖకు అధిక నిధులు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి రాజకీయం చేయడం దారుణం అన్నారు. ఈటలను బలిపశువును చేస్తే టీఆర్ఎస్ పార్టీలో చీలిక తప్పదని అన్నారు.

కేటీఆర్‌ను సీఎం చేయటానికే ఈటలను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కాళ్ళు మెక్కకుండా ఎదిరించే దమ్ము ఈటలకు మాత్రమే ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ను సీఎంను చేస్తానంటే ఈటల రాజేందర్ ఒప్పుకోడన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులు ఇప్పటికైనా కండ్లు తెరవాలన్నారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని, సబిత, పువ్వాడ అజయ్ లాంటి నేతలకు కాలం చెల్లే సమయం వచ్చిందన్నారు. ఈటల కోరినట్లు ఆయనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ ఫాంహౌస్ ఆరోపణలపై కూడా నిజానిజాలు తేల్చాలి. ఉద్యమకారులంతా ఒక తాటిపైకి వచ్చి కేసీఆర్‌పై పోరాటం చేస్తామని కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed