- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నం పెట్టే వారిపై కార్లు ఎక్కిస్తారా..? జంగా రాఘవరెడ్డి ఫైర్
దిశ, జనగామ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేఖంగా రైతులు శాంతియుతంగా నిరసనలు, దీక్షలు చేపడితే ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం రైతుల పైకి వాహనాలు ఎక్కించి అన్యాయంగా నలుగురిని పొట్టన పెట్టుకున్నదని, దీనికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రాను వెంటనే యూపీలో ఉరితీయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశానుసారంతో కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, హోంశాఖ మంత్రిత్వ శాఖ మాత్యులు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా దిష్టి బొమ్మ దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా రైతులు దీక్షలు, నిరసనలు తెలపి కాలినడకన వస్తున్న రైతులను వాహనాలతో ఢీకొట్టి, బుల్లెట్ దాడులు చేయడం అమాను షమని అన్నారు. ఈ దాడిలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బీజేపీ ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి అక్రమ అరెస్టులు చేయడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. దేశానికే అన్నం పెడుతున్న రైతులపై కన్నెర్రజేసి వారి మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి ప్రజల ముందే ఉరితీయాలని డిమాండ్ చేశారు. రైతులను కాపాడుకోలేని చేతగాని ప్రభుత్వాలకు త్వరలోనే బుద్ధిచెప్పేందుకు దేశవ్యాప్తంగా రైతులు కదలి వస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఫ్రెంటెల్ ఆర్గనైజేషన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.