- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS మంత్రులు దద్దమ్మలు.. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
దిశ, సూర్యా పేట: టీఆర్ఎస్ మంత్రులపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌస్‌లో వెంకన్న యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నూతన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డికి జగదీష్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ పర్యటన సందర్భంగా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
తప్పుడు మాటలు మాట్లాడటం టీఆర్ఎస్ నేతలకు అలవాటని, అహంకారపూరిత మాటలు మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డిని తప్పకుండా తరిమికొడతామని హెచ్చరించారు. అంతేగాకుండా.. టీఆర్ఎస్ మంత్రులు ఏమీ చేయలేని ఉత్త దద్దమ్మలు అని సంచలన కామెంట్స్ చేశారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని పగటి వేషగాడు అనే ముందు.. రాష్ట్రంలో అసలు పగటి వేషగాడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నువ్వు బిచ్చగాడివి’’ అని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు.