బేగంపేటలో కాంగ్రెస్ నేతల అరెస్ట్

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బేగంపేటలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి సాయంత్రం వదిలి పెట్టారు. కరోనా కాలంలో పనిచేస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని నేతలను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story