పోటీకి విపక్షాలు దూరం.. నిజామాబాద్ లో కవిత ఏకగ్రీవం..?

by Anukaran |   ( Updated:2021-11-23 01:15:12.0  )
పోటీకి విపక్షాలు దూరం.. నిజామాబాద్ లో కవిత ఏకగ్రీవం..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఖాళీ అయిన శాసనమండలి స్థానానికి సంఖ్యా బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ , మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిసి చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు.

ఇప్పటికే బీజేపీ పోటీకి దూరం..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదని ఇది వరకే ఆ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన చేశారు. లోకల్ బాడీ లో 54 మంది ఓటర్లు ఉండగా బీజేపీ పోటీ నుంచి విరమించుకోవడం విశేషం.

ఆరు నామినేషన్ పత్రాలు..

ఎమ్మెల్సీ ఎన్నికలలో చివరి రోజు మంగళవారం వరకు 6 నామినేషన్ పత్రాలు తీసుకున్నారు అని తెలిసింది. చివరి రోజు వరకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. మంగళవారం లోపు ఎమ్మెల్సీ గా కవిత నామినేషన్ వేయనున్నారు. ఒక్కటే నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం ఎన్నిక ఎకగ్రీవం కావడం ఖాయం.

Advertisement

Next Story

Most Viewed