- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి సేవలకు సలాం: సోనియాగాంధీ వీడియో సందేశం
మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందిని ఆమె కొనియాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవల కంటే గొప్ప దేశభక్తి ఏముంటుందని ప్రశంసించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రజలు చూపుతున్న తెగువ, సహనానికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సోనియా గాంధీ కొన్ని సూచనలు చేశారు. ప్రజలు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దున్నారు. మాస్కులను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. లాక్ డౌన్‌కు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తేనే కరోనాపై పోరులో విజయం సాధిస్తామన్నారు. కరోనాపై పోరుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ కోరారు.
Tags: congress chief sonia, video message, nation