- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు అన్ని కోర్టుల్లో ఆందోళనలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన హింసాత్మక సంఘటనకు నిరసనగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో సోమవారం ఆందోళనలు చేపట్టాలని న్యాయవాదులు నిర్ణయించారు. కోర్టులో విచారణ జరుగతున్న గదిలోనే మారణకాండ చోటుచేసుకుని నలుగురు చనిపోవడం ఆందోళన కలిగించే అంశమని, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తీర్మానించింది. సిటీ సివిల్ కోర్టులో జరిగిన ఫెడరేషన్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులకు పోలీసు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
నేర శిక్షాస్మృతి (క్రిమినల్ ప్రోసీజర్ కోడ్)లోని 41 (ఏ)ని రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెద్ద మనసుతో ఆలోచించి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించాలని ఫెడరేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగం నారాయణ, కార్యదర్శి మధుశేఖర్, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, కిషోర్ కుమార్, పలు జిల్లా కోర్టుల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని తీర్మానానికి ఆమోదం తెలిపారు.
- Tags
- court