జీతం కూడా వద్దు.. నన్ను మంత్రిని చేయండి. సీఎంకు సామాన్యుడి లేఖ

by Shamantha N |   ( Updated:2020-07-08 06:56:18.0  )
జీతం కూడా వద్దు.. నన్ను మంత్రిని చేయండి. సీఎంకు సామాన్యుడి లేఖ
X

దిశ వెబ్‌డెస్క్: మధ్య ప్రదేశ్ సీఎంకు ఓ సామాన్యుడు ఝలక్ ఇచ్చాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూనే.. ఇవ్వని పక్షంలో కేబినెట్‌లో ఉన్న 14 మంత్రులను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్య ప్రదేశ్‌లో తాజాగా ఏ సభలో సభ్యులుగా లేని 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఓ రైటైర్డ్ ఇంజినీర్ బాల చందర్ వర్మ ఏకంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. విధాన సభలో సభ్యులు కాని 14 మంది మంత్రులు కేబినె‌ట్ ‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తనను కూడా మంత్రి వర్గంలో చేర్చుకోవాలన్నారు. లేని పక్షంలో వారిని పదవుల నుంచి తొలగించాలని లేఖలో స్పష్టం చేశారు. తనకు ఎటువంటి జీతం కూడా అవసరం లేదని చెప్పారు. తాను అభ్యర్థించిన వాటిలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా.. చెడు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూనే.. దానికి సీఎం బాధ్యత వహించాలని బాల్ చందర్ అన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed