- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు వరి వేయొద్దని హెచ్చరికలు.. ఇప్పుడు వరి కొనాలని ధర్నా.. మాజీ IASపై సెటైర్లు
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో: సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన మహాధర్నాలో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన ఫొటోను జోడిస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో రైతులెవరు వరి వేయొద్దని, డీలర్లు వరి విత్తనాన్ని అమ్మొద్దని మీటింగ్ పెట్టి మరీ హెచ్చరించిన మాజీ కలెక్టర్, ఇప్పుడు కేంద్రం వరిధాన్యం కొనాలని ధర్నాలో కూర్చున్నారని కామెంట్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వరి వేయొద్దని చెప్పి కొనాలని ధర్నా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story