హిందూ దేవుళ్లు, అమిత్ షాపై జోకులు.. కమెడియన్ అరెస్ట్

by Anukaran |   ( Updated:2021-01-02 22:41:49.0  )
హిందూ దేవుళ్లు, అమిత్ షాపై జోకులు.. కమెడియన్ అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: హిందూ దేవుళ్లతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌, అతని నలుగురు స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ముంబైకి చెందిన స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారుకి కామెడీ షోలో దేవుళ్లపై, అమిత్ షాపై స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామెడీ షో పై సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మలిని లక్ష్మణ్ సింగ్ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గుజరాత్‌ జునాగఢ్‌కు చెందిన మునవర్ ఫారుకి ముంబైలో నివాసం ఉంటూ స్టాండప్ కామెడీలతో కమెడీయన్‌గా చెలామణి అవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌ దుఖన్ కు చెందిన 56 ఏరియాలో స్టాండప్ కామెడీ జరిగింది. ఆ షో జరిగే సమయంలో కమెడియన్ మునవర్ ఫారుకి హిందూ దేవుళ్లపై, అమిత్ షాపై కామెంట్స్ చేశారు. ఆ స్కిట్ సంబంధించి వీడియోల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇండోర్ తుకోగంజ్ పోలీస్ స్టేషన్ అధికారి కమలేష్ శర్మ తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 295-ఏ, సెక్షన్ -269 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement

Next Story