పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

by Sridhar Babu |
పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
X

దిశ నల్గొండ: పట్టణ ప్రగతిలో భాగంగా మిగిలి ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణ ప్రగతిపై మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ డి.సంజీవ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మోడల్ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలంలోనే కాకుండా సంవత్సరం పొడువునా మొక్కలు నాటాలని.. అందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

tag: collector orders, officials, pattana pragathi, suryapet

Advertisement

Next Story