- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చుట్టూ మొక్కలుండాలి: కలెక్టర్ శరత్
by Shyam |
X
దిశ, ఎల్లారెడ్డి: రైతు వేదిక భవనాల నిర్మాణం పనులను సత్వరమే పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్, మీసాన్ పల్లి గ్రామాలలో రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆగస్టు 15 లోగా రైతు వేదిక పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని తెలిపారు. రైతు వేదిక భవనాల చుట్టూ రెండు వరుసలలో మొక్కలు నాటాలని సూచించారు. వారం రోజుల్లో పల్లె ప్రగతి పనులు అన్ని గ్రామాల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, తహశీల్దార్ శ్రీనివాస్ రావు, పీఏసీఎస్ చైర్మెన్ ఏగుల నర్సింలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story