- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిపోర్టులో తప్పులుంటే మీరే బాధ్యులు..
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని 92 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా జూన్ 1 నుంచి 8 వరకు గ్రామాల్లో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి విజిలెన్స్ అధికారులు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంది. అయితే వారు అందజేసే రిపోర్టులో తప్పులు ఉంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి శానిటేషన్, ఇతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలోని సుమారు 92 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఏ ఏ పనులు చేపట్టారు, ఎంతవరకు పూర్తి అయ్యాయి, హరితహారం కార్యక్రమానికి ముందస్తు చర్యలు, స్మశాన వాటిక, కంపోస్టు షెడ్ల నిర్మాణం తదితర అంశాలపై పరిశీలన చేసి నివేదిక అందించడానికి 57మంది విజిలెన్స్ ఆఫీసర్లను గ్రామ పంచాయతీలకు పంపించామన్నారు. కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోందని, వర్షాకాలం ప్రారంభమవడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.ఈరోజు 92 గ్రామ పంచాయతీలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తారని వివరించారు.మిగతా గ్రామపంచాయతీలను వచ్చే వారం పరిశీలించి, విజిలెన్స్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే తప్పకుండా గ్రామపంచాయతీ సర్పంచ్, అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంబడి జెడ్పీ వైస్ చైర్మన్ రజిత, గ్రామ సర్పంచ్ షేక్ అమానుల్లా షరీఫ్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంపీపీ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.