- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్‌లాక్ 4: మెట్రోలో నాగుపాము

దిశ, వెబ్‌డెస్క్ : పాములు చెట్లు, పుట్టలను వదిలి జనవాసాల్లోకి రావడం సహజం. ఇళ్లల్లోకి దూరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కామన్. కానీ ఇటీవల కొన్ని పాములు ట్రెండ్ మార్చాయి. ఐదు నెలల క్రితం హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ఓ పాము కలకలం సృష్టించింది. పటిష్ట బందోబస్త్, నిత్యం సీసీ కెమెరాల పహరాలో రెండు అంతస్తుల ఎత్తులో ఉంటే మెట్రో స్టేషన్‌లోకి వెళ్లిన పాము బోగిలోకి వెళ్లేందు ప్రయత్నించింది. ప్రయాణికులు గమనించి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దానిని పట్టుకున్నారు. ఈ ఘటన మరవక ముందే ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఇలాంటి ఘటనే శనివారం చోటుచేసుకుంది.
ఢిల్లీ సాకేత్ మెట్రో రైల్వే స్టేషన్‌లో సుమారు నాలుగు అడుగుల నాగుపాము హల్‌చల్ చేసింది. మెట్రో స్టేషన్ గేటు దగ్గర పాము తిరుగుతుండడంతో గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వన్యప్రాణి సంరక్షణ బృందాన్ని పిలిపించి పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలివేశారు.