- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు నమ్మినబంటుకు మోదీ బంపర్ ఆఫర్? కేంద్ర మంత్రివర్గంలో చోటు?
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. చాలారోజుల తర్వాత ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న క్రమంలో.. ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉండగా.. ఏపీ నుంచి ఎవరూ కేంద్ర మంత్రివర్గంలో లేరు.
ఈ క్రమంలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్‌కి మంత్రి పదవి లభించనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబుకు నమ్మినబంటుగా సీఎం రమేష్‌కి రాజకీయాల్లో పేరుంది. టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడుగా సీఎం రమేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌తో పాటు సీఎం రమేష్ కూడా బీజేపీలో చేరారు. కేంద్ర పెద్దల దగ్గర సీఎం రమేష్‌కి మంచి పలుకుబడి ఉంది. బీజేపీ అగ్రనేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడంతో.. రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఒకరికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక సీటు కూడా దక్కలేదు. ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వీరిని కావాలనే చంద్రబాబే బీజేపీలోకి పంపించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో.. టీడీపీ ఖాళీ అయింది. ఆ నలుగురు ఎంపీలు తమను బీజేపీ ఎంపీలుగా పరిగణించాలని లేఖ పెట్టుకోవడంతో.. వారిని బీజేపీ ఎంపీలుగా రాజ్యసభ కార్యాలయం పరిగణిస్తుంది. ఈ క్రమంలో ఏపీ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశమున్నట్లు ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.