- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరునూరైనా దళితబంధు ఆగదు : కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ మరోమారు స్పందించారు. ప్రగతి భవన్ వేదికగా టీఆర్ఎస్‌లో బీజేపీ నేతల చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ఆరునూరైనా ఆగదన్నారు. చాలా మంది హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అవాకులు చవాకులు పేలుతున్నారని.. వాస్తవానికి ఈ ఏడాది కంటే ముందే దళితబంధు రావాల్సి ఉన్నా కరోనా వల్ల ఆలస్యమైందన్నారు.దేశ జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్డీపీ చాలా ఎక్కువ అని స్పష్టంచేశారు.
తెలంగాణకు పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయని, మనది ఎప్పటికీ ధనిక రాష్ట్రమే అని అన్నారు. అనేక ఏళ్లుగా దళిత బంధుపై కసరత్తు చేశామన్నారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి మహారాష్ట్ర నుంచి కొందరు వచ్చారని, మీ రాజకీయం మీరు చేసుకొండని తిరిగి పంపించి వేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దళిత బంధు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండిందని, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు అయిపోతే తెలంగాణ కాశ్మీరం అవుతుందన్నారు.