మీ కోసం చివరి రక్తపు బొట్టువరకు కొట్లాడతా : సీఎం కేసీఆర్

by Sridhar Babu |
cm-kcr
X

దిశప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డట్టుగానే దళితుల అభ్యున్నతి కోసం పాటుపడతానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దళిత బంధుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… స్వరాష్ట్ర కల సాకారం అయ్యేవరకూ ఎలా పోరాటం చేశానో దళితబంధు విజయవంతం కోసం అంతే గట్టిగా పట్టుబడతానన్నారు. చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడి తీరుతానని ప్రకటించారు.

దళిత జాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురి కావడానికి సమాజమే కారణమని స్పష్టంచేశారు. దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ సాధించుకున్నట్టుగానే స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసం అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టంచేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed