- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రబెల్లితో కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా?
దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీళ్లు అందుతున్నాయా.. లేదా.. విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వారి మాటల్లోనే..
సీఎం: హలో దయాకర్ రావు పూర్వ వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..?
మంత్రి: నిన్ననే పూర్వ వరంగల్ జిల్లాలో కరోనా వైరస్‌పై కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్షించాం సార్. పూర్వ వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం. వరంగల్ ఎంజీఎంలో, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగులో కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తూ, వారి వారి ఇండ్ల కే పరిమితమయ్యారు సార్.
ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ, పరిస్థితిని సమీక్షిస్తున్నాను సార్. వరంగల్ ఎంజీఎంకు కరోనా పరీక్షలు చేసే కేంద్రానికి మంజూరీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
సీఎం: వెల్ డన్ ఇదే స్ఫూర్తిని కొనసాగిచండి, కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ, మంచి సమన్వయంతో పని చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పూర్వ వరంగల్ జిల్లాకి అందుతున్నాయా? ఇంకా రైతాంగానికి నీటి అవసరం ఉందా? ఇంకా ఎంత కాలం నీరు కావాలి?
మంత్రి: మరో 15 రోజులపాటు కాళేశ్వరం నీరు పూర్వ వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ రైతాంగానికి అవసరం ఉంది. ప్రస్తుతం మొక్కజొన్న పంటలకు మరో తడికి సాగు నీటి అవసరం ఉంది. దయతో, మరో 10 లేదా15 రోజులపాటు కాళేశ్వరం నీరు అందేలా చూడండి సార్. అని మంత్రి కోరారు.
ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం కాళేశ్వరం నీటిని మరో 10 లేదా 15 రోజులపాటు అందించడానికి అంగీకరించారని, కరోనా నిర్మూలనపై దిశానిర్దేశం చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
tag: CM KCR, phone, Minister Errabelli, corona, kaleshwaram water