- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోనల్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామా?
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఏళ్లు గడుస్తున్నా జోనల్ సిస్టమ్ పేరుతో సీఎం కేసీఆర్ తమ జీవితాలతో ఆటలాడుతున్నారని నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అవుతున్నారు. గత ఏడు నెలలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా జోనల్ సిస్టమ్ అమలు చేశాకే అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జోనల్ సిస్టమ్‌కు సంబంధించిన జీవోని షేర్ చేస్తూ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమలుకు సంబంధించిన ఆర్డర్‌ను సెంట్రల్ హోం ఎఫైర్స్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది ఏప్రిల్16న ఇచ్చిందని, కేవలం అందులో పొందుపరిచిన అంశాలను కాపీ పేస్ట్ చేసేందుకే 75 రోజులు చేశారంటూ ఆరోపించారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేసి జూలై 30న విడుదల చేశారని తెలిపారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వైఖరితో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కొక్కరిగా ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దృష్టిసారించాలని గవర్నర్ తమిళిసైని కోరారు.
సీఎం కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారని, అదేవిధంగా తెలంగాణలోని యువత గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సీఎం కేసీఆర్ కమిటీ వేస్తూ కొత్త డ్రామాలకు తెరలేపారని, ఈ కమిటీలు మిలియన్ మార్చ్, నిరుద్యోగ సైరన్ నిరసన కార్యక్రమాల వల్లే అని విమర్శించారు.
Need Support from all the opposition leaders to fight for job Notifications in #Telangana @revanth_anumula @bandisanjay_bjp @RSPraveenSwaero @realyssharmila @TeenmarMallanna @TSNSUI @VenkatBalmoor @BJYMinTS @GayathriBandar7 @Bhanu4Bjp #KcrGiveNotificationsOrResign
(6/n)— Telangana Unemployed Youth (@TUYOfficialPage) November 11, 2021