‘పది’ పరీక్షలపై రేపు సీఎం సమీక్ష

by Shyam |   ( Updated:2020-06-07 10:31:11.0  )
‘పది’ పరీక్షలపై రేపు సీఎం సమీక్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8న సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యి పరీక్షల నిర్వహణపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రీఫైనల్ పరీక్షల మార్కులో ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడంతో పాటు మూడు ప్రతిపాదనలను విద్యాశాఖ సీఎం సమీక్ష కోసం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ఆయన సూచన మేరకే పరీక్షలపై ఏ నిర్ణయమైనా ప్రభుత్వం ప్రకటించనుంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి పరిధిలో మినహా రాష్ట్రమంతా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు సూచనలు ప్రభుత్వం పక్కన పెట్టింది. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలను కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నిర్వహిస్తారా.. లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed