- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్ విధించిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగా నష్టపోయిందన్నారు. ఆ అనుభవంతో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు లేవనెత్తిన అంశాలకు బదులిస్తున్న సందర్భంగా కరోనా సృష్టించిన ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి విస్ఫోటనం కావద్దన్న ఉద్దేశంతోనే పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మూసివేశామని, ఇది తాత్కాలికమేనని, దీనికి కొనసాగింపుగా లాక్‌డౌన్ లాంటి చర్యలు ఉండవన్నారు. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ప్రజలు స్వచ్చందంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమన్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, పరిశుభ్రంగా ఉండడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గుర్తుచేశారు. కరోనా కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, దేశ జీడీపీ మైనస్‌లోకి పోయినా తెలంగాణ మాత్రం వృద్ధి సాధించిందన్నారు. కరోనా సమయంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాల అమలు ఆగలేదని గుర్తుచేశారు.