- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాధర్నాలో కేసీఆర్.. కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం
దిశ, వెబ్‌డెస్క్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ గురువారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని రైతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వైఖరి రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని విమర్శించారు. కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ మహాధర్నా. #TRSwithFarmers https://t.co/MRk6ty7P89
— TRS Party (@trspartyonline) November 18, 2021