- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నెరవేరిన జగిత్యాల వాసుల చిరకాల స్వప్నం
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వాసులు ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి చిరకాల స్వప్నం నెరవేరింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. సోమవారం ప్రగతి భవన్‌లో కొవిడ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని, ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల కొత్త వాటిని మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారని మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు.