- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ బాధ పోవాలే.. దళిత సాధికారతకు కేసీఆర్ నయా ప్లాన్..
దిశ, వెబ్‌డెస్క్ : దళిత సాధికారత కోసం కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ప్రగతి భవన్ వేదికగా అన్నిపార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత సాధికారత కోసం పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని తెలిపారు. దళిత సమాజం ముందుకు పోవడానికి ఇంకా ఏం చేయాలో సూచనలు చేయాలని నాయకులను కోరారు. సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే ముందుగా చెప్పే పేరు దళితులు అని గుర్తుచేశారు. వీరికి ఆ బాధ పోవాలన్నారు. ఇందుకు దశలవారీగా కార్యచరణ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లాలని, అందుకోసం పార్టీకతీతంగా సమిష్టి కార్యాచరణతో బాధ్యత తీసుకుందామని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇదిలాఉండగా ‘దళిత్ ఎంపవర్ మెంట్’ కోసం నిర్వహించే అల్‌పార్టీ మీటింగ్‌ను కాంగ్రెస్, బీజేపీ బహిష్కరించినా.. హస్తం పార్టీ నుంచి భట్టి విక్రమార్క, బీజేపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. మరోవైపు ప్రజలను తప్పుదారిపట్టించేందుకే దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.