- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్మల రామానాయుడుపై సీఎం జగన్ ఫైర్
దిశ, వెబ్డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని విమర్శించారు. రామానాయుడు సభలో రోజూ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. రామానాయుడుపై ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదించారు సీఎం జగన్.
ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ ఎంత పెన్షన్ ఇచ్చిందో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి నెల నుంచే పెన్షన రూ.2,250 ఇచ్చామని తెలిపారు. వచ్చే జూలై నుంచి రూ.2,500 అందిస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల కోసం నెలకు రూ.1,500 కోట్ల ఖర్చు పెడుతున్నామని చెప్పుకొచ్చారు. తమ మేనిఫెస్టో రెండు పేజీలో ఉంటుందని.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రామానాయుడు ప్రివిలేజ్ మోషన్‌పై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన ప్రివిలేజ్ మోషన్‌ను కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. సభలో వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. వాస్తవాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రికార్డ్ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.