డిక్లరేషన్‌ ఇవ్వని సీఎం జగన్‌

by srinivas |
డిక్లరేషన్‌ ఇవ్వని సీఎం జగన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే డిక్లరేషన్ ఇచ్చాకే సీఎం జగన్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ డిక్లరేషన్ ఇవ్వలేదు. ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వకుళామాతను దర్శించుకొని విమాన ప్రకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకున్నారు.

Advertisement

Next Story