- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడాకారులను అభినందించిన జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా టీమ్‌లో సభ్యులైన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణను ఏపీ సీఎం జగన్ అభినందించారు. రష్యాతో ఉమ్మడిగా భారత జట్టు బంగారం పతకం సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన సీఎం.. భారత చదరంగం జట్టు అందరూ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. భారత చెస్ క్రీడాకారుల అప్రతిహత విజయం హర్షణీయమని చంద్రబాబు, లోకేశ్ కొనియాడారు. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి నిజమైన మాస్టర్లని అన్నారు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 5 నుంచి 17వరకు జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసి.. దాని స్థానంలో ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్‌కు వెళ్లగా.. మ్యాచ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలిచినట్లు ఫిడె ప్రకటించింది.