దుబ్బాక ఎమ్మెల్యే మృతికి సీఎం, గవర్నర్ సంతాపం

by  |
దుబ్బాక ఎమ్మెల్యే మృతికి సీఎం, గవర్నర్ సంతాపం
X

దిశ, న్యూస్‌బ్యూరో: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయన స్వగ్రామానికి వెళ్ళి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మృతదేహానికి నివాళులర్పించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరుండి అధికార లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన రామలింగారెడ్డి వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వామపక్ష భావజాలం కలిగిన రామలింగారెడ్డి తెలుగు జర్నలిజంలో సుమారు రెండున్నర దశాబ్దాల పాటు పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ప్రారంభం నుంచీ కేసీఆర్‌తోనే ఉన్నారు. 2004 మొదలు 2018 వరకు వరుసగా అన్నిఎన్నికల్లోనూ (2009 మినహా) గెలిచిన రెడ్డితో పరిచయం ఉన్న వివిధ పార్టీల నేతలు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోయారు. ఆయన మృతి దుబ్బాక ప్రజలకు, రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed